CM and IT Minister pitch Hyderabad strongly for diaspora investments at Dallas IT Serve Alliance meet

Cm Revanth Reddy Addressed A Mammoth Gathering Of It Serve Alliance (1)

CM Revanth Reddy, IT Minister Sridhar Babu pitch Hyderabad strongly for diaspora investments at Dallas IT Serve Alliance meet.

Hyderabad made you best in the world, now you help us to make Hyderabad the world’s best: CM tells Indian Tech Diaspora.

Addressing a mammoth gathering of IT Serve Alliance here, the largest association of IT Services organizations based in the USA, Chief Minister A. Revanth Reddy and Industries, Commerce and IT Minister D. Sridhar Babu made a strong pitch to the members to actively consider investments in Hyderabad and Telangana, and partner in any of the plethora of projects and engagements being created for the diaspora.

Cm Revanth Reddy Addressed A Mammoth Gathering Of It Serve Alliance 3

The alliance, oft dubbed as the “voice of all prestigious IT companies functioning with similar interests across United States”, welcomed the Chief Minister for their annual flagship event in Vegas later this year, a platform on which several world leaders, including former US presidents Bill Clinton and George W. Bush, former secretary Hillary Clinton and, icons like Steve Forbes have held stage.

Talking to the gathering, CM Revanth said, “We have built Hyderabad, Secunderabad and Cyberabad over the years. Now, let us all join to making a world-class fourth city, the Future City. When you invest in Hyderabad now, you are clearly investing into the future.”

Cm Revanth Reddy Addressed A Mammoth Gathering Of It Serve Alliance 5

Minister Sridhar Babu explained how the Future City, the extension of Metro, and the River Musi rejuvenation project were all parts of larger strategy to reimagine Hyderabad in the coming decade. “It will be a hub for future tech like AI, and with Net Zero impact design, it will be an urban construct of truly global standards and processes.”

He also elaborately explained how the focus was on balance, which has prompted a huge push for service sector growth in Tier-II towns on the one hand, and a platform being created for augmenting the economy through fill-up to manufacturing.

“Chief Minister Revanth Reddy has declared a vision to transform Telangana into a US $1 trillion within a decade. Let us all work to achieve it,” Sridhar Babu added.

రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్‌ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్‌ ఐటి సర్వ్‌ అలయన్స్‌ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లను నిర్మించుకున్నాం. ఇప్పుడు మనందరం కలిసి ప్రపంచ స్థాయి నాల్గవ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నాం. హైదరాబాద్లో ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది..’ అని స్పష్టం చేశారు.

రాబోయే దశాబ్దంలో హైదరాబాద్‌ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ , మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులను చేపట్టిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సభలో మాట్లాడారు. హైదరాబాద్ ను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా మారుతుందని అన్నారు. హైదరాబాద్ తో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ సేవా రంగాలను వృద్ధి చేయటంతో పాటు తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని చెప్పారు. రాబోయే దశాబ్దంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఎంచుకున్నారని, ఈ వృద్ధిని సాధించేందుకు అందరూ కలిసిరావాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.

అమెరికాలోని అన్ని ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల గొంతుకగా.. ఈ అలయెన్స్​ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది చివర్లో వేగాస్‌లో ఐటీ సర్వ్ అలయెన్స్ తమ వార్షిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షులు సహా పలువురు పేరొందిన లీడర్లు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్ లాంటి ప్రపంచ దిగ్గజాలు హాజరవుతారు. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని అలయెన్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.

Telangana Rising