CM addressed in business roundtable organised by KOFOTI

Pitched the Mega Textile Park in Warangal as an ideal destination for further investments from Korean textiles companies at a business roundtable organised by KOFOTI (Korea Federation of Textile Industry).

The gathering, including Mr Kihak Sung, Chairman, Youngone, Mr Soyoung Joo, Executive Vice-Chairman, KOFOTI, and other top leaders of 25 major textile companies, responded with amazing enthusiasm. Expect to attract more investments for Warangal, and rest of Telangana in the Textile sector. My colleague D. Sridhar Babu and officials will put together a task force to follow up on all the opportunities for quick closures and action on the ground.

Cm Revanth Reddy Addressed In Business Roundtable Organised By Kofoti (1)

వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులపై కొరియ‌న్ కంపెనీల ఆస‌క్తి

  • ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పిలుపునకు కొరియ‌న్ జౌళి ప‌రిశ్ర‌మ స‌మాఖ్య సానుకూలత
  • త్వ‌ర‌లో తెలంగాణ‌ను సంద‌ర్శించ‌నున్న ఎల్ఎస్ కంపెనీ బృందం

సియోల్‌: వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బృందం పలు ప్ర‌పంచ‌స్థాయి కంపెనీల అధినేతలు, వ్యాపార బృందాల‌తో చ‌ర్చ‌లు జరిపింది. ఈ క్ర‌మంలో కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (KOFOTI) ఆధ్వర్యంలో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ‌హించారు. స‌మావేశంలో యాంగాన్ (Youngone) ఛైర్మ‌న్ కిహ‌క్ సుంగ్ , KOFOTI ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మ‌న్ సోయాంగ్ స‌హా 25 భారీ జౌళి కంపెనీల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

స‌మావేశంలో టెక్స్‌టైల్ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేప‌ట్టిన కార్యాచరణ, వ‌రంగ‌ల్ టెక్స్‌టైల్ పార్క్‌తో పాటు తెలంగాణ‌లో టెక్స్‌టైల్ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి ఉన్న సానుకూల‌త‌ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వివ‌రించారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని పిలుపునిచ్చారు. ముఖ్య‌మంత్రి పిలుపున‌కు కొరియ‌న్ టెక్స్‌టైల్ కంపెనీల ప్ర‌తినిధులు సానుకూల‌త వ్య‌క్తం చేశారు.

ద‌క్షిణ కొరియాలో అతి పెద్ద పారిశ్రామిక సంస్థ అయిన ఎల్ఎస్ కంపెనీ ప్ర‌తినిధులు త్వ‌ర‌లో తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌తినిధి బృందం ఎల్ఎస్ గ్రూప్ ఛైర్మ‌న్ కు జా యున్ నేతృత్వంలోని ఆ కంపెనీ సీనియ‌ర్ల‌తో స‌మావేశ‌మైంది. స‌మావేశంలో తెలంగాణ‌లో ఎల‌క్ట్రిక్ కేబుళ్లు, గ్యాస్‌, విద్యుత్‌, బ్యాట‌రీల ఉత్ప‌త్తి, పెట్టుబ‌డుల‌పై చ‌ర్చ‌లు జ‌రిగాయి. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేర‌కు ఎల్ఎస్ బృందం త్వ‌ర‌లోనే తెలంగాణ‌కు రానుంది. ఎల్ఎస్ కంపెనీ గ‌తంలో ఎల్‌జీ గ్రూప్‌లో భాగ‌స్వామిగా ఉండేది.