Charles Schwab chooses Hyderabad as the prospective location for its first Technology Development Center in India

Cm Revanth Reddy And Minister Sridhar Babu Held Meeting With Charles Schwab Team In Dallas (1)

We are delighted to announce that Charles Schwab, a global leader in financial services, has chosen Hyderabad as the prospective location for its first Technology Development Center in India.

This significant decision follows fruitful discussions between Hon’ble Chief Minister Mr. A. Revanth Reddy, IT Minister Mr. Sridhar Babu Duddilla, and senior Schwab executives, Mr. Dennis Howard, Mr. Rama Bokka and others at Charles Schwab’s world headquarters in Dallas today.

Cm Revanth Reddy And Minister Sridhar Babu Held Meeting With Charles Schwab Team In Dallas 3

The Hon’ble Chief Minister and the IT Minister have committed to guiding Schwab through all necessary formalities for establishing their presence in Hyderabad, ensuring swift access to the necessary talent for a rapid ramp-up.

Schwab’s executives have expressed confidence and enthusiasm, and appreciated the proactive support from the Government as a promising indicator of a successful collaboration.

Cm Revanth Reddy And Minister Sridhar Babu Held Meeting With Charles Schwab Team In Dallas 2

Charles Schwab is currently awaiting the final approvals for announcing detailed insights into the upcoming center and to delegate a team to India for officially establishing the Schwab Technology Center in Hyderabad.

Hyderabad now clearly stands out as a prime destination among cities globally.

హైదరాబాద్లో ఛార్లెస్ స్క్వాబ్

  • కొత్తగా టెక్నాలజీ డెవెలప్మెంట్ సెంటర్
  • డల్లాస్లో సీఎంతో కంపెనీ ప్రతినిధుల చర్చలు

ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్‌ ఇదే కావటం విశేషం. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌ లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబుతో ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవెలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.