- Launch of farm loan waiver scheme is a memorable day in his 16 year political career
- Passbook is enough to avail farm loan waiver scheme benefit
- Previous government waived only Rs 21,000 crore farm loans
- Congress government fulfilled the promise made by Sonia Gandhi and Rahul Gandhi
- Thanksgiving public meeting in Warangal in July end. Rahul Gandhi to attend the meeting.
- CM Sri Revanth Reddy distributes farm loan waiver cheques to beneficiaries
- The CM speaks to the farmers of different districts through video conference
Chief Minister Sri A. Revanth Reddy said that Telangana became a role model by launching the farm loan waiver scheme up to Rs 2 lakh for the first time in any state in the country. Started political career as a ZPTC member and was elected as MLA, MLC and MP and also worked with Congress leaders Sonia Gandhi and Rahul Gandhi in Lok Sabha. “Today is a memorable day for him in his entire political career,” the CM said while launching the farm loan waiver scheme up to Rs 2 lakh at the Secretariat on Thursday evening.
On this occasion, the Chief Minister addressed the farmers gathered at 577 Rythu Vedikas in the state through video conference. CM Revanth Reddy said that Rahul Gandhi announced Rs 2 lakh farm loan waiver scheme in the Farmers Declaration at the Warangal public meeting on May 6, 2022. Sonia Gandhi made Six promises which included the farm loan waiver on September 17, 2023. The Congress government fulfilled the promise of waiver of farm loans with the cooperation of the cabinet colleagues and officials, the CM said that the congress proved again it is committed to the word given by the leadership.
The CM reminded that Sonia Gandhi made the promise of the formation of Telangana in 2004 in the Karimnagar public meeting by recognizing the aspirations of the people for more than 60 years and she fulfilled the promise despite the Congress faced political hurdles in the united AP which continued more number of MP seats to the party in the country. The CM praised Sonia Gandhi as a leader who never turned back and announced statehood for Telangana.
The CM said that he along with Deputy Chief Minister Bhatti Vikramarka will go to Delhi to express their gratitude to Sonia Gandhi and Rahul Gandhi and invite them to attend a thanksgiving public meeting in Warangal Arts College where the party made the promise of loan waiver. Rahul Gandhi will be invited to the public meeting and express our gratitude to him on behalf of the farmers of the state.
Previous BRS government waived not more than Rs 21, 000 crore farm loans
CM Revanth Reddy criticized former Chief Minister K Chandrashekhar Rao for the latter’s failure in fulfilling the promise of waiver of farm loans. The CM fired a salve at KCR for waiving the farm loans not more than Rs 12,000 crore in installments as against the promise of Rs 16,000 crore in the BRS first term. After coming to power for the second consecutive time, KCR made the promise of waiver of Rs 12,000 crore and again cheated the farmers by waiving Rs 9000 crore loans only. The CM expressed anger over the waiver of not more than Rs 21,000 crore farm loans in the 10 year BRS rule. As a result, the farm community struggled with the mounting debt and interest burden and they are also forced to commit suicide.
The Chief Minister said that Rs.6,098 crores have been released to clear the farm loans up to Rs.1 lakh in the first installment. In the second installment, loans up to Rs 1.50 lakh will be waived and Rs 2 lakh loans will be waived in the third phase before August end. Rs 31,000 crore will be deposited in the farmers accounts and the loans will be waived. Even though his government took oath on December 7, the government took December 9, on the day the official process to the formation of Telangana started, as criteria to implement the farm loan waiver scheme. Since December 9 is also observed as the birthday of Sonia Gandhi, the CM said that the loans taken between December 12, 2018 and December 9, 2023 will be waived.
Opposition conspires to create misconceptions
CM Revanth Reddy said that some people are creating a misconception that Ration card is mandatory to avail farm loan waiver benefit. Ration card is only for the identity of the farmer’s family. Passbook is only considered to extend the benefit. The CM cautioned the farmers not to get carried away by false campaigns and appealed to the officials to educate the farmers on farm loan waiver.
The Chief Minister suggested to the officials to contact bank officials in case technical problems arise in the implementation of the scheme. The CM thanked the bank management for accepting the implementation of loan waiver scheme by addressing the challenges. The chief minister asked the officials of the agriculture department to ensure that the loan waiver money is deposited in the farmers accounts directly.
The Agriculture Minister himself is a farmer
CM Revanth Reddy praised Agriculture Minister Tummala Nageswara Rao for being a good farmer and speaking about the farming issues occasionally. The Chief Minister recalled that Deputy Chief Minister Bhatti Vikramarka embarked on a padayatra from Adilabad to Khammam and learned about the farmers’ plights. At the time of formation of Telangana, the then government paid only Rs 6,500 crore as interest on loans per year. Today, the government is paying Rs 7,000 crore interest on loans every month. The previous government put Rs 7 lakh crore debt burden on the state.
Despite facing financial challenges, CM Revanth Reddy said that his government has been paying the salaries promptly to the government employees and already spent Rs 29,000 crore to implement Six Guarantees in just 8 months. Now, the state government has taken up the big task of waiving farm loans. The CM said that he will not insist on the opposition leaders who said they are ready to quit politics if the government implements the farm loan waiver scheme. The CM suggested to the opposition those who threw challenges should remember that Gandhi family stick to their word.
Adopts Thanksgiving resolution
The Chief Minister appealed to the farmers to support a resolution of thanksgiving for Rahul Gandhi, Sonia Gandhi and Mallikarjuna Kharge for keeping their word of implementation of farm loan waiver scheme. Farmers extended their support with a big applause.
Deputy Chief Minister Bhatti Vikramarka, Legislative Assembly Speaker Gaddam Prasad Kumar, Legislative Council Chairman Gutta Sukhender Reddy, Ministers Tummala Nageswara Rao, N Uttam Kumar Reddy, Ponguleti Srinivas Reddy, Ponnam Prabhakar, Sridhar Babu, Advisor to the State Government K. Kesava Rao, Advisor to the Chief Minister Vem Narender Reddy, Principal Secretary to the Govt. Shanti Kumari and others participated.
CM presents farm loan waiver cheque to farmers
Chief Minister Revanth Reddy handed over cheques to 10 farmers whose loans were waived up to Rs one lakh.
Malipeddi Chennamma (Thommidirekula village), Jarpula Shankar (Challapalli), Chintakindi Bhikshapati (Lemuru), Bandi Jagadamba (Gudur), Kyatharamoni Mallaiah from Keshampet mandal of Rangareddy district (Pedda Elkacharla-Jillade Chowdaryguda Mandal), Gudugu Chennayya (Agiryala-Kundurg Mandal), Maramoni Yadamma (Tummaluru-Maheswaram Mandal), Arakottam Sarada (Muktamadaram-Kadtal Mandal), Vityala Andalu (Krishna Nagar-Farukh Nagar Mandal) and Malligari Manikya Reddy (Gopula Ram-Shankarpally Mandal) received loan waiver cheques.
Farmers thanked CM Revanth Reddy
The Chief Minister interacted with farmers through video conference at the farm loan waiver scheme launching program. K Sitaram from Khammam District, Ramulamma (Nagar Kurnool District), Tipparthi Raju (Nalgonda District), Karrolla Sivaiah (Sangareddy), Kuruva Lakshmi from Dhanwada, Narayanpet, Ravi from Bodhan, Nizamabad District and others spoke to the CM. Farmers expressed their happiness for launching the loan waiver and thanked Chief Minister Revanth Reddy.
దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం
- రుణమాఫీతో 16 ఏళ్ల రాజకీయ జీవితంలో మరుపురాని రోజు
- రుణమాఫీకి పాసు బుక్‌నే కొలబద్ద
- పదేళ్లు అధికారంలో ఉండి రూ.21 వేల కోట్లు మాఫీ చేయలేకపోయారు
- సోనియా, రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం
- నెలాఖరున వరంగల్‌లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చెక్కుల అందజేత
- వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లాల రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇప్పటి వరకు ఆ మోడల్, ఈ మోడల్ అని పలువురు చెప్పుకున్నారు రూ.2 లక్షల రైతు రుణమాఫీతో ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వం దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, నమూనాగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జడ్పీటీసీ సభ్యునిగా, శాసనమండలి సభ్యునిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పార్లమెంట్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పని చేశానని తెలిపారు. తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ రోజు మరుపురాని రోజని ముఖ్యమంత్రి భావోద్వేగానికి గురయ్యారు. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించిన కార్యక్రమాన్ని రాష్ట్ర సచివాలయంలో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 577 రైతు వేదికల్లోని అన్నదాతలు, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆయా రైతు వేదికల వద్దనున్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ 2002, మే 6వ తేదీన వరంగల్లో రాహుల్ గాంధీ రైతు డ్లికరేషన్ ప్రకటించారని, నాడే రూ.2 లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చామని గుర్తు చేశారు. 2023, సెప్టెంబరు 17వ తేదీన కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ ఆరు గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ అగ్ర నేతల హామీ ప్రకారం.. మంత్రివర్గ సహచరులు, అధికారుల సహకారంతో రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని రుణమాఫీతో మరోసారి నిరూపణ అయిందని ముఖ్యమంత్రి అన్నారు. అరవై సంవత్సరాల ప్రజల ఆకాంక్షను గుర్తించి 2004లో కరీంనగర్ సభలో సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చారని, ఎక్కువ ఎంపీ సీట్లున్న ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్రంగా నష్టపోతామని తెలిసినా ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ఇచ్చారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా, తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని ముఖ్యమంత్రి కొనియాడారు. రైతుల అనుమతితో తాను, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతామన్నారు. ఏ వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రుణమాఫీ హామీ ఇచ్చామో అక్కడే కృతజ్ఞత సభ పెడతామని, ఆ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించి రాష్ట్ర రైతుల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
పదేళ్లలో రూ.21 వేల కోట్లను మించలే
మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ రుణమాఫీ విషయంలో రెండు సార్లు మాట తప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. రూ.లక్ష రుణమాఫీతో తొలిసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రూ.16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని, అయిదేళ్లలో దఫాదఫాలుగా కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని మండిపడ్డారు. రూ.లక్ష రుణమాఫీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రూ.12 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి దఫాదఫాలుగా కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే చేశారని, మొత్తంగా పదేళ్లలో రూ.21 వేల కోట్లకు మించి రుణమాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఒకే సారి రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీలు మిగిలిపోయి రైతుల అప్పులు తీరలేదన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కేసీఆర్ ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చలేదని విమర్శించారు. తాము ఒకేదఫా రూ.2 లక్షల మేర రుణాలను మాఫీ చేస్తున్నామన్నారు. తొలి విడతగా 0 నుంచి రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలకు రూ.6,098 కోట్లను విడుదల చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రెండో విడతగా 0 నుంచి రూ.1.50 లక్షల వరకు ఉన్న రైతులకు, మూడో విడతగా 0 నుంచి రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆగస్టు నెల పూర్తికాక ముందే రూ.31 వేల కోట్లను రైతు రుణ ఖాతాల్లో వేసి రుణ విముక్తులను చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం డిసెంబరు ఏడో తేదీనే ప్రమాణ స్వీకారంచేసినా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన డిసెంబరు 9వ తేదీని పరిగణనలోకి తీసుకొని రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. డిసెంబరు 9న మరో పండుగ ఉందని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబరు 9వ తేదీనేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అందుకే 2018 డిసెంబరు 12 నుంచి 2023, డిసెంబరు 9 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
అపోహలు సృష్టించేందుకు యత్నాలు
రుణమాఫీకి రేషన్ కార్డు ఉండాలనే అపోహను కొందరు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమేనన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదని, రుణమాఫీకి పాస్ బుక్‌నే కొలబద్ద అని ముఖ్యమంత్రి తెలిపారు. భూమి ఉండి, ఆ భూమికి పాసు బుక్ ఉండి, పాసు బుక్‌పై రుణం తీసుకుంటే దానిని మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ విషయంలో కొందరు దొంగలు చేసే దొంగ మాటలను నమ్మొద్దని, దీనిపై అవగాహన కల్పించాలని ఆయన అధికారులు, రైతు వేదికల్లోని రైతులను కోరారు. రుణమాఫీకి సంబంధించి విద్యలేని, సాంకేతిక నైపుణ్యం లేని రైతులెవరికైనా సమస్యలు తలెత్తితే బ్యాంకు అధికారులను సంప్రదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆ సమస్యలు పరిష్కరించి రుణమాఫీ చేయాలని తాము బ్యాంకు అధికారులను కోరామని, అందుకు వారు అంగీకరించారని, అలా అంగీకరించినందుకు బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము చేరేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు.
వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా రైతు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా మంచి రైతు అని, ఆయన స్వయంగా వ్యవసాయం చేస్తారని, ఏ సమయం వచ్చినా, సందర్భం వచ్చినా రైతు సమస్యలపైనే మాట్లాడుతుంటారని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి రైతు సమస్యలను తెలుసుకున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఏడాదికి రూ.6,500 కోట్ల వడ్డీలు కట్టాల్సి ఉంటే, గత ప్రభుత్వం చేసిన రూ.ఏడు లక్షల కోట్ల అప్పులతో ఇప్పుడు నెలకు రూ.7 వేల కోట్లు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం జీతాలు సరిగా ఇవ్వలేకపోయిందని, ఆర్థిక ఇబ్బందులున్నా ఎనిమిది నెలల కాలంలోనే రూ.29 వేల కోట్ల విలువైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. రుణమాఫీ చేయలేమంటూ మాకు సవాల్ విసిరిన వారిని రాజీనామా చేయమని తాము అడగమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని సవాళ్లు విసిరిన వారు గుర్తు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
కృతజ్ఞత తీర్మానం
రైతు రుణమాఫీ హామీ ఇచ్చి నిలుపుకున్నందున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లకు ధన్యవాదాలు తెలుపుదామా అని ముఖ్యమంత్రి రైతు వేదికల్లో ఉన్న రైతులను అడిగారు. అందుకు సమ్మతిస్తూ అంతా చప్పట్లతో ఆమోదం తెలపడంతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలకు కృతజ్ఞత తీర్మానాన్ని ఆమోదించారు. త్వరలోనే మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని వరంగల్ కృతజ్ఞత సభకు ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
పది మంది రైతులకు రుణమాఫీ చెక్కుల అందజేత
రూ.లక్ష రుణమాఫీ అయిన పది మంది రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి చెందిన మలిపెద్ది చెన్నమ్మ (తొమ్మిదిరేకుల గ్రామం), జర్పుల శంకర్ (చౌలపల్లి), కందుకూరు మండలానికి చెందిన చింతకింది భిక్షపతి (లేమూరు), బండి జగదాంబ (గూడూరు), ఎర్రా అండాలు (ముచ్చెర్ల), క్యాతరమోని మల్లయ్య (పెద్ద ఎల్కచర్ల-జిల్లేడ్ చౌదరిగూడ మండలం), గొడుగు చెన్నయ్య (అగిర్యాల-కొందుర్గ్ మండలం), మారమోని యాదమ్మ (తుమ్మలూరు-మహేశ్వరం మండలం), అరకోటం శారద (ముక్తమదారం-కడ్తాల్ మండలం), విట్యాల అండాలు (కృష్ణ నగర్-ఫరూఖ్ నగర్ మండలం), మల్లిగారి మాణిక్య రెడ్డి (గోపులారం-శంకర్‌పల్లి మండలం) రుణమాఫీ చెక్కులు అందుకున్నారు.
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన రైతులు
రుణమాఫీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వేదికల వద్ద ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఖమ్మం జిల్లా వి.వెంకటాయపాలెం నుంచి కుతుంబాక సీతారాం, నాగర్ కర్నూల్ జిల్లా రామాపురం నుంచి రాములమ్మ, నల్గొండ జిల్లా నుంచి తిప్పర్తి రాజు, సంగారెడ్డి నుంచి కర్రోళ్ల శివయ్య, నారాయణపేట జిల్లా ధన్వాడ నుంచి కురువ లక్ష్మి, నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి రవి, ఆదిలాబాద్ జిల్లా తాంసీ నుంచి గుర్రి మహేందర్ తదితరులు సీఎంతో మాట్లాడారు. రుణమాఫీ చేసినందుకు సంతోషం వ్యక్తం చేసిన రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.