State Govt. to accept CMRF applications online only

Applications for the Chief Minister’s Relief Fund (CMRF) will be accepted online only. As per the instructions given by Chief Minister Sri A Revanth Reddy, the government took the decision to receive CMRF applications online to ensure the funds are utilized transparently. The Centre for Good Governance created an official Website for the purpose. The CM launched the website in the Secretariat on Tuesday evening. The Congress government formulated a new policy in the wake of the diversion of CMRF funds in the previous state government. From now onwards, the CMRF applications should be uploaded on the official website. MLAs and MLCs should also upload their recommendation letter by enclosing the details of the CMRF applicants. The applicant should also mention the bank account details in the online application. The applicant will receive a code after uploading the application. Based on the code, the applicant should submit the original medical bills to the Secretariat. Online applications will also be sent to the respective hospitals for confirmation. Cheques will be prepared only after the CMRF application is approved and the details are verified and proven correct. The bank account number of the applicant will be printed on the cheque.

The new system will prevent misuse of cheque. After that, the people’s representatives will personally hand over the cheques to the applicants. The CMRF applications will be accepted online after July 15 this year. Applications are available at https//cmrf.telangana.gov.in website.

ఇక నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

హైద‌రాబాద్‌:  ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) దరఖాస్తులను ఇక నుంచి ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో వెబ్ సైట్ ను రూపొందించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వెబ్ సైట్ ను మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పెట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ఇక ముందు ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఈ వెబ్ సైట్ లో అప్‌లోడ్   చేయాల్సి ఉంటుంది.సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖ ను జత చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో సంబంధింత దరఖాస్తు దారుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను  సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ ఎఫ్ అప్లికేషన్ ను ఆమోదించి చెక్ ను సిద్ధం చేస్తారు. చెక్ పైన తప్పని సరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ ను ముద్రిస్తారు. దీని వల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉండదు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్ లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. https//cmrf.telangana.gov.in సైట్ లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది.