Education Commission soon

Chief Minister Revanth Reddy Holds A Meeting With Professors 19 07 2024 (1)
  • Government to bring revolutionary changes in the education system
  • Anganwadis will be promoted to Pre-Schools
  • Semi-Residential and Residential Schools for classes 4 to 12th standard
  • Formulate a policy document for changes in education
  • University VCs, teaching and non-teaching staff will be appointed soon
  • The Chief Minister holds a meeting with Professors

Chief Minister Sri A. Revanth Reddy said that the state government will constitute an Education Commission to improve the standards of the present education system in the state. The Chief Minister made it clear that his government is committed to providing quality education, skill training and employment from Anganwadi and primary schools to the universities.

At a meeting held with Professors at the Secretariat on Friday, the CM said that the government issued a notification for the appointments of more than 11,000 teachers posts, conducting TET twice a year, providing uniforms and textbooks to all children on the opening day of schools, and providing infrastructure in schools through State School Committees are part of improving facilities in the schools, CM Revanth Reddy said that “ We will take all the necessary steps to strengthen the system of government schools and inviting good suggestions from the educationists.”

Chief Minister Revanth Reddy Holds A Meeting With Professors 19 07 2024 4

Professors Haragopal, Kodandaram, PL Visweswara Rao, Santha Sinha, Aldas Janaiah, Lakshminarayana, and former IAS officer Akunuri Murali participated in the meeting. They explained to the CM the challenges facing the education system and made some suggestions in the meeting.

Professors brought to the attention of the Chief Minister that the Anganwadi centers are not equipped with good facilities and the teachers are also not much skilled in teaching the students.

Chief Minister Revanth Reddy Holds A Meeting With Professors 19 07 2024 2

The Chief Minister said the government proposed to convert Anganwadi centers into pre-schools and appoint volunteers with the necessary training to teach pre-primary education to the students. A plan is also being prepared for the establishment of semi-residential and residential schools for classes 4 to 12 standard to ensure education is provided in preschool till class 3 and also provide free transport facility for the students to go to the respective schools.

The experts in education also brought to the notice of the CM that the appointment of teaching staff in the universities has been stopped for the last 10 years and the Vice Chancellor posts are also not filled. CM Revanth Reddy said that Search Committees have already been formed for the appointment of VCs and the official process will be completed soon. Professor Aldas Janaiah appealed to the Chief Minister to sanction development grants to the universities and establish study centers related to the history of development in each university for in-depth discussion on various topics

Professor Haragopal and Professor Santa Sinha expressed serious concern that Telangana stood at the bottom of the education index. They said all of them studied at Osmania University and visited many countries also. It is unfortunate that education standards have fallen in OU as well. The CM said that the government already formed a cabinet sub-committee with ministers Sridhar Babu, Sitakka and Ponnam Prabhakar to strengthen the education system. The Chief Minister said that the government will take a call if a policy document is prepared on the changes that need to be enforced in the education system and suggested the professors discuss these issues with the Cabinet Sub-Committee.

Professor Aldas Janaiah informed the Chief Minister that the World Bank and Asian Development Bank are providing long-term loans at very low interest rates to strengthen the education system. Many states are already trying to avail the funds. The CM assured to look into the matter. Professor Haragopal said that budget allocations for education were 11 percent of the total outlay in the erstwhile united Andhra Pradesh and today it is only 6.4 percent in the Telangana state . Haragopal insisted on increasing funds to strengthen the education system. The CM said that since Deputy Chief Minister Bhatti Vikramarka and himself studied in government schools, he will definitely increase allocations to strengthen the education system in the government sector. The Deputy Chief Minister said that the Chief Minister has already decided to bring revolutionary changes in the education system and the budget allocation will be increased in the new budget. Government Advisor K. Keshava Rao, Chief Minister’s Principal Secretary Seshadri, Chief Minister’s Secretary Manikraj and Education Department’s Principal Secretary Burra Venkatesham are also present

త్వ‌ర‌లో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు

  • విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువ‌స్తాం…
  • ప్రీ స్కూల్స్‌గా అంగ‌న్‌వాడీలు, నాలుగు నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సెమీరెసిడెన్షియ‌ల్‌, రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌కు యోచ‌న‌
  • మార్పుల‌కు విధాన ప‌త్రం రూపొందించండి..
  • యూనివ‌ర్సిటీ వీసీలు, బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందిని నియ‌మిస్తాం…
  • విద్యావేత్త‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థను మెరుగుప‌ర్చ‌డానికి త్వ‌ర‌లోనే విద్యా క‌మిష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. అంగ‌న్‌వాడీ, ప్రాథ‌మిక పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వ విద్యాల‌యాల వ‌ర‌కు నాణ్య‌మైన విద్య బోధ‌న‌, నైపుణ్య శిక్ష‌ణ‌, ఉపాధి క‌ల్ప‌న‌కు త‌మ ప్ర‌భుత్వ క‌ట్టుబ‌డి ఉంద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ బ‌లోపేతంపై చ‌ర్చించేందుకు విద్యావేత్త‌ల‌తో స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం భేటీ అయ్యారు.

విద్యా వ్య‌వ‌స్థ బ‌లోపేత‌మే ల‌క్ష్యంగా 11 వేల‌కుపైగా ఉపాధ్యాయ పోస్టుల నియామ‌కాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డం, టెట్ నిర్వ‌హ‌ణ‌, ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించ‌డం, పాఠ‌శాల‌లు తెరిచిన రోజే పిల్ల‌లంద‌రికీ యూనిఫాంలు, పాఠ్య పుస్త‌కాల అంద‌జేత‌, అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల క‌మిటీల ద్వారా పాఠ‌శాల‌ల్లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న చేప‌ట్టిన విధానాన్ని ముఖ్య‌మంత్రి తెలియ‌జేశారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, విద్యావేత్త‌లు ఇచ్చే మంచి సూచ‌న‌లు స్వీక‌రిస్తామ‌ని తెలియ‌జేశారు. భేటీలో పాల్గొన్న ప్రొఫెస‌ర్లు హ‌ర‌గోపాల్‌, కోదండ‌రాం, పి.ఎల్‌.విశ్వేశ్వ‌ర‌రావు, శాంతా సిన్హా, ఆల్దాస్ జాన‌య్య‌, ప‌ద్మ‌జా షా, ల‌క్ష్మీనారాయ‌ణ, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళి విద్యా వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి ప‌లు సూచ‌న‌లు చేయ‌డంతో పాటు ప్ర‌స్తుతం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి వివ‌రించారు.

అంగ‌న్‌వాడీల్లో కార్య‌క‌ర్త‌ల‌కు బోధించే నైపుణ్యం ఉండ‌డం లేద‌ని, స‌రైన వ‌స‌తులు లేవ‌ని ప్రొఫెస‌ర్లు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటిని ప్రీ స్కూల్స్‌గా మార్చి వాలంటీర్ల‌ను తీసుకొని వారికి శిక్ష‌ణ ఇచ్చి పూర్వ ప్రాథ‌మిక విద్య‌కు అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ ఇచ్చేలా తీర్చిదిద్దాల‌నే యోచ‌న చేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి తెలిపారు. మూడో త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్రీస్కూల్‌లో బోధ‌న అందేలా చూసి, నాలుగు నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సెమీ రెసిడెన్షియ‌ల్‌, రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్ర‌ణాళిక రూపొందిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి తెలిపారు. ఆయా స్కూళ్ల‌కు వెళ్లేందుకు విద్యార్థుల‌కు ఉచిత ర‌వాణా స‌దుపాయం యోచ‌న త‌మ‌కు ఉంద‌న్నారు. ప‌దేళ్లుగా యూనివ‌ర్సిటీల్లో బోధ‌న సిబ్బంది నియామ‌కం జ‌ర‌గ‌లేద‌ని, వీసీలు లేర‌ని ప్రొఫెస‌ర్లు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీసీల నియామ‌కానికి ఇప్ప‌టికే సెర్చ్ క‌మిటీలు వేశామ‌ని, త్వ‌ర‌లోనే వీసీల నియామ‌కం పూర్త‌వుతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివ‌ర్సిటీల‌కు డెవ‌ల‌ప్‌మెంట్ గ్రాంట్స్ ఇవ్వాల‌ని, ప్ర‌తి యూనివ‌ర్సిటీలో వివిధ అంశాల‌పై లోతైన చ‌ర్చ‌, వాస్త‌వాల వెల్ల‌డికి అభివృద్ధి చ‌రిత్రకు సంబంధించిన అధ్య‌య‌న కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని ప్రొఫెస‌ర్ ఆల్దాస్ జాన‌య్య ముఖ్య‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు.

విద్యా సూచిక‌లో తెలంగాణ అట్ట‌డుగున‌ ఉంద‌ని, తామంతా ఉస్మానియా విశ్వ విద్యాల‌యంలోనే చ‌దువుకున్నామ‌ని, ప్ర‌పంచ దేశాల‌న్నీ తిరిగి వ‌చ్చామ‌ని, ప్ర‌స్తుతం ఓయూలోనూ విద్యా ప్ర‌మాణాలు ప‌డిపోయాయ‌ని ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌, ప్రొఫెస‌ర్ శాంతా సిన్మా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

విద్యా వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి తాము ఇప్ప‌టికే మంత్రులు శ్రీ‌ధ‌ర్‌బాబు, సీత‌క్క‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌ల‌తో క్యాబినెట్ స‌బ్ క‌మిటీ ఏర్పాటు చేశామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. విద్యా వ్య‌వ‌స్థ‌లో తీసుకురావ‌ల్సిన మార్పుల‌పై విధాన ప‌త్రం రూపొందిస్తే.. దానిపై చ‌ర్చించి ఒక నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ఆయా అంశాల‌పై క్యాబినెట్ స‌బ్ క‌మిటీతోనూ చ‌ర్చించాల‌ని వారికి సూచించారు.

విద్యా వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి ప్ర‌పంచ బ్యాంకు, ఏసియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు అతి తక్కువ వ‌డ్డీకి, దీర్ఘ‌కాల రుణాలు ఇస్తాయ‌ని, ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు వాటి సాధ‌న‌కు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని ప్రొఫెస‌ర్ ఆల్దాస్ జాన‌య్య ముఖ్య‌మంత్రికి తెలియ‌జేశారు. ఆ అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో 11 శాతంగా ఉన్న విద్యా శాఖ బ‌డ్జెట్ తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత 6.4 శాతానికి ప‌డిపోయింద‌ని, విద్యా వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి బ‌డ్జెట్ పెంపు అవ‌స‌ర‌మ‌ని ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ తెలిపారు. తాను, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఇద్ద‌రం ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లోనే చ‌దువుకున్నామ‌ని, క‌చ్చితంగా ప్ర‌భుత్వ విద్యా వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి బ‌డ్జెట్ పెంచుతామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తేవాల‌ని ముఖ్య‌మంత్రి నిర్ణ‌యించార‌ని, బ‌డ్జెట్ కేటాయింపులు త‌ప్ప‌కుండా పెంచుతామ‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. భేటీలో ప్ర‌భుత్వ స‌లహాదారు కే.కేశ‌వ‌రావు, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శేషాద్రి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి మాణిక్‌రాజ్‌, విద్యా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం పాల్గొన్నారు.