- The CM announces a residential plot and government job to Siraj
Chief Minister Sri A. Revanth Reddy congratulated all rounder cricketer Mohammad Siraj for bringing laurels to the country and a great honour to the Telangana State in international cricket. Siraj, who reached Hyderabad after winning the T-20 World Cup, paid a courtesy call on the Chief Minister at the latter’s residence on Tuesday morning. On this occasion, CM Revanth Reddy felicitated the international cricketer from Hyderabad Siraj. The Chief Minister praised Siraj for displaying his amazing talent in international cricket and stood as one of the greatest players in the world of cricket. The CM ordered the officials to allot a residential plot and a government job to Siraj on behalf of the state government. The officials have been asked to identify a suitable land for a plot in Hyderabad or surrounding areas and also take steps to provide a government job to India’s fast bowler Siraj immediately.
అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన అల్ రౌండ్ క్రికెటర్ శ్రీ మొహమ్మద్ సిరాజ్ ను ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అభినందించారు. టీ-20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్ కు చేరుకున్న సిరాజ్ మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిరాజ్ ను ఘనంగా సన్మానించారు. మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడని, అందుకే ఈ రోజు అత్యున్నత స్థాయి క్రికెటర్లలో ఒకడుగా పేరు సంపాదించుకున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలసిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.