CM’s review on Medigadda Barrage

Cm Sri Revanth Reddy Reviewed Issues Related To Repairs, Inspections, And Commission Inquiries Of The Medigadda Barrage

Chief Minister Sri Revanth Reddy reviewed issues related to repairs, inspections, and commission inquiries of the Medigadda Barrage. The review meeting was held on Sunday at the Chief Minister’s official residence in Delhi, with the state’s Irrigation Minister Uttam Kumar Reddy, State Irrigation Department Secretary Rahul Bojja, and State Irrigation Department Advisor Adityanath Das in attendance. Minister Uttam Kumar Reddy and officials brought to the Chief Minister’s attention the matters discussed during the National Dam Safety Authority (NDSA) meeting held on Saturday in Delhi. The Chief Minister shared his opinions on these issues. The Chief Minister also gave several suggestions regarding the NDSA meeting scheduled to be held in Delhi on Monday, where officials and engineers are set to participate.

మేడిగ‌డ్డ‌పై ముఖ్య‌మంత్రి స‌మీక్ష‌
మేడిగ‌డ్డ బ్యారేజీ మ‌ర‌మ్మ‌తులు, ప‌రీక్ష‌లు, క‌మిష‌న్ విచార‌ణ త‌దిత‌ర‌ అంశాల‌పై ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స‌మీక్షించారు. ఢిల్లీలోని త‌న‌ అధికారిక నివాసంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్త‌మ్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ కార్య‌ద‌ర్శి రాహుల్ బొజ్జ, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ స‌ల‌హాదారు ఆదిత్య‌నాథ్‌ దాస్ తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం స‌మావేశమ‌య్యారు. ఢిల్లీలో శ‌నివారం జ‌రిగిన నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ అంశాల‌ను మంత్రి ఉత్త‌మ్‌ కుమార్‌ రెడ్డి, అధికారులు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాల‌పై ముఖ్య‌మంత్రి త‌న అభిప్రాయాల‌ను వారికి తెలియ‌జేశారు. సోమ‌వారం ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న ఎన్‌డీఎస్ఏ స‌మావేశంలో అధికారులు, ఇంజినీర్లు స‌మావేశంపైన ముఖ్య‌మంత్రి ప‌లు సూచ‌న‌లు చేశారు.