CM participated in the Kamma Global Summit

Cm Sri A Revanth Reddy Participated In The Kamma Global Summit In Hyderabad 20 07 2024 (5)

Chief Minister Sri A Revanth Reddy participated in the Kamma Global Summit in Hyderabad on Saturday.

Cm Sri A Revanth Reddy Participated In The Kamma Global Summit In Hyderabad 20 07 2024 3

CM Revanth Reddy’s speech points:

  • The word Kamma means to acquaint the quality of hard work and show immense affection like a mother. Kamma community make their presence everywhere in the vicinity of fertile lands
  • The basic character of Kammas is to work hard and extend help to others. The Kamma community respects and shows a lot of affection for me.
  • We all studied in NTR’s library and it made us to reach a high level.
    NTR has created a brand of leadership and gave opportunities to many people to grow politically.
  • Many people have political opportunities today because of the coalition politics introduced by NTR in the country.
  • Appeal to all of you to join as partners in promoting Hyderabad as a global and cosmopolitan city. My government is ready to promote your skills. We respect every caste and creed.
  • No discrimination against anyone in Telangana state. My government will not pursue discrimination policies.
  • Staging protest is a democratic right. We already witnessed the outcome of suppressing the citizens rights.
  • The absence of Telugu leaders role in national politics is visible. Telugu leaders who excel at the national level should be encouraged irrespective of caste and religion.
  • Government is committed to resolve the land dispute on the ownership of 5 acres of land allotted to Kamma Sangam.
  • Apart from solving the land issue, Government is ready to provide funds for the construction of community building. My appeal to Kamma community not to give away the practice of helping others.
Cm Sri A Revanth Reddy Participated In The Kamma Global Summit In Hyderabad 20 07 2024 2

కమ్మ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్

  • కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారు.. అమ్మలాంటి ఆప్యాయత కలిగినవారు.
  • కమ్మవారు నేలను నమ్ముకుని కష్టపడి పనిచేస్తారు.
  • ఎక్కడ సారవంతమైన నేల ఉంటే అక్కడ కమ్మవారు కనిపిస్తారు.
  • కష్టపడటం… పదిమందికి సాయం చేయడం కమ్మవారి లక్షణం.
  • కమ్మసామాజికవర్గం నన్ను ఎంతగానో అభిమానిస్తుంది..
  • ఎన్టీఆర్ లైబ్రరీలో మేం చదువుకున్న చదువు..మమ్మల్ని ఉన్నతస్థానంలో నిలబెట్టింది.
  • నాయకత్వానికి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు.
  • ఎన్టీఆర్ రాజకీయంగా ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు.
  • దేశంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాల వల్లే ఇవాళ చాలా మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయి.
  • హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు మీరు భాగస్వాములు కావాలి.
  • మీలో నైపుణ్యాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
  • మాకు భేషజాలు లేవు.. మేం కులాన్ని అభిమానిస్తాం.. ఇతర కులాలను గౌరవిస్తాం.
  • తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదు.. అది మా ప్రభుత్వ విధానం కాదు..
  • ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక హక్కు.
  • నిరసన తెలపకుండా నియంత్రించాలనుకుంటే.. ఫలితాలు ఎలా ఉంటాయో మీరు చూశారు.
  • జాతీయ స్థాయిలో తెలుగువారు లేని లోటు కనిపిస్తోంది.
  • కుల, మతాలకు అతీతంగా జాతీయ స్థాయిలో రాణించే తెలుగువారిని ప్రోత్సహించాలి.
  • వివాదంలో ఉన్న 5ఎకరాల కమ్మ సంఘం భూ సమస్యను పరిష్కరిస్తాం..
  • భూసమస్యను పరిష్కరించడంతో పాటు సంఘం భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
  • పదిమందికి సాయం చేసే మీ సహజ గుణాన్ని వీడొద్దని కోరుతున్నా..