CM participated in an interaction programme on Quality Engineering Education

Cm Revanth Redy Participated In An Interaction Programme On Quality Engineering Education At Jntu 13 07 2024 (2)

Chief Minister Sri A. Revanth Reddy participated in an interaction programme on Quality Engineering Education in Telangana, organized at JNTU, Hyderabad campus on Saturday.

CM Revanth Reddy’s speech points:

The programme has been conducted to explain government policies in promoting technical education. Former Chief Minister of the erstwhile united Andhra Pradesh YS Rajashekhara Reddy introduced a fee reimbursement program aiming to provide free education to poor children.

The arrears of fee reimbursement accumulated due to the change of priorities under various circumstances. IT and Industry Minister D Sridhar Babu is entrusted with the responsibility of addressing the issue of clearance of fee reimbursement.

The government will put all efforts into the timely payment of fee reimbursement from this academic year. There is no need to worry about the release of fee reimbursement funds. My government adopted a three pronged strategy in the implementation of fee reimbursement.

All the great structures in the country and in the world are the creation of the engineers. Engineers invented all man-made wonders.

Engineering colleges should not become a factory of generating unemployed youth. The Colleges should strive hard to provide employment and build the country’s future. The state government is ready to extend all possible help to the institutions.

The engineering colleges should not be confined to only creating jobs but also intellectuals for the country. Apart from computer science, the colleges should also promote all types of courses like Civil and mechanical engineering.

As part of a skill development programme, the government has already taken up a project to upgrade the government owned ITIs in collaboration with Tata Company at the cost of Rs 2400 crore. The State Government will also launch Skill Development University for youth soon.

Artificial intelligence is set to dominate the world after IT and Pharma. The Telangana state will be developed to compete with the world.

My Government will take all decisions to benefit the unemployed youth. The government will conduct examinations as per the notifications issued. Unemployed youth fought for jobs in the last 10 years.

Some political parties and the management of the coaching centers are staging hunger strikes for the postponement of the exams.

The State Government will release the job calendar soon. On the lines of UPSC, the state government will issue job notifications and fill the posts every year.

The government’s policy is educational institutions should not become centers of political rehabilitation. 30,000 jobs were already filled within 30 days after coming to power in the state.

Despite facing financial constraints and other problems, my government is moving forward by addressing every issue.

జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పై ఇంటరాక్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు….

  • ప్రభుత్వ విధానాలను వివరించాలనే ఈ కార్యక్రమం చేపట్టాం…
  • ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్ నిర్ణయం తీసుకున్నారు.
  • రకరకాల పరిస్థితులలో ప్రాధాన్యతలు మారి.. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పేరుకుపోయాయి.
  • పాత బకాయిలపై ఎలా ముందుకెళ్లాలనే అంశాన్ని పరిష్కరించే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నాం..
  • ఈ అకాడామిక్ ఇయర్ నుంచి ఆన్ టైమ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించేందుకు ప్రయత్నిస్తాం..
  • ఫీజు రీయింబర్స్ మెంట్ పై మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు..
  • ఫీజు రీయింబర్స్ మెంట్ పై త్రిముఖ వ్యూహంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతుంది.
  • దేశంలో, ప్రపంచంలో గొప్ప నిర్మాణాలన్నీ ఇంజనీర్లు సృషించినవే..
  • మానవనిర్మిత అద్భుతాలన్నీ ఇంజనీర్లు ఆవిష్కరించినవే…
  • ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు…
  • ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి దేశ భవిష్యత్తును నిర్మించేలా ఉండాలి..
  • అందుకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది…
  • కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాదు.. దేశానికి మేధావులను అందించే సంస్థలుగా ఇంజనీరింగ్ సంస్థలు ఉండాలి.
  • ఇంజనీరింగ్ లో కేవలం కంప్యూటర్ సైన్స్ పైనే కాదు… సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి అన్ని రకాల కోర్సులనూ ప్రోత్సహించాలి..
  • స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా టాటా భాగస్వామ్యంతో రూ.2400 కోట్లతో ప్రభుత్వం ఐటీఐల రూపురేఖలు మారుస్తోంది..
  • ఫార్మా, ఐటీ తరువాత ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతోంది.
  • యువత కోసం త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం..
  • ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం..
  • మా ప్రభుత్వానికి భేషజాలు లేవు… నిరుద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి.
  • నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ముందుకెళుతోంది.
  • పదేళ్లు ఉద్యోగాల భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కొట్లాడింది…
  • కానీ.. ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారు…
  • త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను తీసుకురాబోతున్నాం..
  • యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తాం…
  • విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేదే మా ప్రభుత్వ విధానం…
  • మేం అధికారంలోకి వచ్చిన మొదటి 30రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేసాం..
  • ఆర్ధిక భారం, ఇతర సమస్యలు ఉన్నా… ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది..