CM attended the Student Voluntary Policing Program at JNTU

Cm Revanth Reddy Attended The Student Voluntary Policing Program At Jntu 13 07 2024 (4)

Chief Minister Sri A Revanth Reddy attended the Student Voluntary Policing Program at JNTU on Saturday.

CM Revanth Reddy’s speech points:

Undesirable consequences can be prevented if we identify the problems in the society and solve them. Technology has become a reason for increasing bad tendencies in society. We can prevent many problems by keeping children away from mobile phones.

The reason for psychological weakness of children is that the family system is collapsing fast. A joint family helps children to grow strong mentally. Children should be prepared mentally strong. For this, children need to be taught social policing and community policing.

Cm Revanth Reddy Attended The Student Voluntary Policing Program At Jntu 13 07 2024 1

Need to focus on the eradication of the drug menace seriously. Apart from teaching subjects, school and college students should inculcate the habit of participating in moral policing. Suggested that the management develop a system to monitor behavioral changes in children.

Urgent need for NSS volunteers in schools and colleges. State will be promoted as a drug free society by developing a network to provide information to the police instantly.

The government constituted the Telangana Anti-Narcotics Bureau to control drugs. The Government has already declared a war on drugs. As a brother, appeal to all to help the state free from drug abuse.

Cm Revanth Reddy Attended The Student Voluntary Policing Program At Jntu 13 07 2024 3

Telangana, which is known for struggles and movements, should be a drug free state in the country. Ordering the police to establish a moral policing system in all Inter and Degree colleges on the lines of Kerala. All kinds of problems can be solved through moral policing.

The state government decided to promote sports and planned to establish a sports stadium in every assembly constituency. The government will take some important decisions to encourage sportsmen in the future.

The elected representatives are considered as the most responsible in the society. I have reached this level because I have been focusing on public issues. Do not run away from problems. Stand up and fight them.

Focus on work to achieve the goals. Everyone including PM Narendra Modi, Bill Gates and Revanth Reddy has only 24 hours a day. If you are focused and work hard for at least 16 hours a day, you will achieve your goals fast. Our life is in our hands. Everything is how to design our life. Great people have not come from great families. No one is inferior to anyone.


జేఎన్టీయూలో స్థూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…

సమాజంలో ఉండే సమస్యలను మనమే గుర్తించి పరిష్కరించుకుంటే దుష్ఫలితాలను నివారించుకోవచ్చు.

సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఓ కారణంగా మారింది…

పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచితే చాలా సమస్యలను నివారించవచ్చు.

కుటుంబ వ్యవస్థ విచిన్నం కావడమే చిన్నారుల మానసిక బలహీనతలను కారణం.

చిన్నారుల మానసిక దృఢత్వానికి ఉమ్మడి కుటుంబం తోడ్పడుతుంది..

పిల్లలను మానసికంగా సంసిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.

ఇందుకోసం పిల్లలకు సోషల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ నేర్పించాల్సిన అవసరం ఉంది.

డ్రగ్స్ నిర్మూలనపై సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది…

స్కూల్స్,కాలేజెస్ లో సబ్జెక్ట్ నేర్పించడమే కాదు… మోరల్ పోలీసింగ్ కూడా నేర్పించాలి.

పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించే వ్యవస్థ ఉండాలని నిర్వాహకులకు సూచించాం..

స్కూళ్లు, కాలేజీల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అవసరం ఎంతో ఉంది..

పోలీసులకు సమాచారం చేరవేసేలా వ్యవస్థను తయారు చేసుకుంటే.. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చవచ్చు.

డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసింది.

డ్రగ్స్ పై ప్రభుత్వం యుద్ధమే ప్రకటించింది.

మీ అన్నగా పిలుపునిస్తున్నా… డ్రగ్స్ నిర్మూలనకు సహకరించండి…

ఉద్యమాల గడ్డ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి.

అన్ని ఇంటర్ , డిగ్రీ కళాశాలల్లో కేరళ మాదిరిగా మోరల్ పోలీసింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా…

మోరల్ పోలీసింగ్ తో అన్ని రకాల సమస్యలను పరిష్కరించొచ్చు..

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

భవిష్యత్ లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.

ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యత…

ప్రజా సమస్యలపై ఫోకస్ గా పనిచేయడం వల్లే నేను ఈ స్థాయికి చేరా..

సమస్యలకు భయపడి పారిపోవద్దు… నిలబడి సమస్యలపై పోరాడాలి.

జీవితంలో ఫోకస్ గా పనిచేయండి.. లక్ష్యాలను సాధిస్తారు.

నరేంద్రమోదీకైనా, బిల్ గేట్స్ కైనా, రేవంత్ రెడ్డికైనా రోజుకు 24 గంటలే..

రోజుకు 16గంటలు మీరు ఎంత ఫోకస్ గా పని చేస్తారో… అది మీ లక్ష్యాన్ని అంత చేరువ చేస్తుంది..

మన జీవితం మన చేతుల్లోనే ఉంది… మన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో మన చేతుల్లోనే ఉంటుంది..

గొప్ప వ్యక్తులు ఎవరూ గొప్ప కుటుంబాల నుంచి రాలేదు…

ఎవరూ ఎవరికంటే తక్కువ కాదు..

Telangana Rising