State Cabinet meeting held under the chairmanship of CM Sri Revanth Reddy

Cm Sri Revanth Reddy Addressig The Press After The State Cabinet Meeting 21 06 2024 4

The State Cabinet meeting held under the chairmanship of CM Sri Revanth Reddy at the Secretariat. Later Hon’ble CM addressed the media.

Chief Minister Sri A Revanth Reddy addressed the media in the Secretariat on Friday. As promised in the Farmers’ Declaration in Warangal, the state Cabinet discussed the implementation of farm loan waiver scheme to benefit the farmers.

The Congress policy is to promote agriculture as a profitable profession. Congress leaders Smt Sonia Gandhi, Sri Rahul Gandhi and Sri Mallikarjuna Kharge are committed to fulfilling the assurances.

The Cabinet decided to waive the farm loan up to Rs 2 lakh. The previous government waived only Rs 28,000 crore farm loans in its 10 year rule. The last government put the cut off on December 11, 2018, to avail of the farm loan waiver scheme benefit.

The farm loan waiver scheme up to Rs 2 lakh will be implemented at one go. My government decided to waive off the farm loans taken by the farmers between 12 December 2018 and 9 December 2023. It required around Rs 31,000 crore for the loan waiver scheme.

The government decided to waive off loans for the welfare of farmers. The previous government did not keep its promise to the farmers in ten years. Our government is fulfilling the promise to the farmers within eight months after coming to power in the state.

People are debating the Rythu Bharosa scheme. Discussions are taking place that the scheme benefit was also extended to rich people, lands which come under the realty sector , hills, roads etc. The Government constituted a Cabinet Sub-Committee to implement the Rythu Bharosa in a transparent manner. The cabinet sub- committee is headed by Deputy Chief Minister Bhatti Vikramarka and Ministers T Nageshwara Rao, D Sridhar Babu and P Srinivas Reddy will be the members of the sub-Committee. The Cabinet sub-committee will submit a report to the government by July 15. The government will table the report in the Legislative Assembly and implement Rythu Bharosa transparently by seeking everyone’s suggestions.

Ministers – Sridhar Babu and P Srinivas Reddy will take the responsibility of briefing the cabinet decisions and other administrative matters of the government to the media regularly. The information provided by the two ministers is only considered as the official information of the government. Media should take note of this before broadcasting information. No need for doubts on the implementation of the farm loan waiver scheme. Modalities and guidelines for loan waiver scheme will be declared through the Government Order.

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు:

  • వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీపై కేబినెట్ లో చర్చించాం.
  • వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానం.
  • మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే..
  • కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలా శాసనం..
  • ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
  • గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన రుణమాఫీ రూ.28వేల కోట్లు..
  • గత ప్రభుత్వం 11డిసెంబర్ 2018 వరకు కటాఫ్ తేదీతో రుణమాఫీ చేసింది.
  • మా ప్రభుత్వం 12డిసెంబర్ 2018 నుంచి 9డిసెంబర్ 2023 మధ్యకాలంలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది.
  • రుణమాఫీకి దాదాపు రూ.31వేల కోట్లు అవసరమవుతోంది.
  • రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించింది.
  • గత ప్రభుత్వం పదేళ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు.
  • మా ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది.
  • రైతు భరోసాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి..
  • రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారని చర్చ జరుగుతోంది.
  • అందుకే రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియమించాం.
  • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని నియమించాం.
  • జూలై 15లోగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది.
  • ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తాం.
  • మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వ పరిపాలనపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యత శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటారు.
  • వారిద్దరు ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారం.
  • సమచారం ప్రసారం చేసేముందు మీడియా మిత్రులు ఇది గమనించాలి.
  • రుణమాఫీపై తినబోతూ రుచులెందుకు..
  • రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. దీనిపై ఎవరికీ శషబిషలు అవసరం లేదు.
  • నియమ నిబంధనలకు సంబంధించి జీవోలో అన్నీ పొందుపరుస్తాం..