Chief Minister Sri A. Revanth Reddy, accompanied by his cabinet colleagues, visited the Command Control Center on Saturday.
Deputy Chief Minister Bhatti Vikramarka, Ministers- N Uttam Kumar Reddy, P Srinivas Reddy, D Sridhar Babu, Ponnam Prabhakar, Chief Secretary Santhi Kumari and DGP Ravi Gupta were present.
Instructed the authorities to take adequate safety measures in view of the onset of the rainy season. The officials have been asked to establish a mechanism to respond in the emergency situation.
Integrate the disaster management by taking the ORR (Outer Ring Road) as a unit. Connect all the CCTV cameras inside the ORR to the Command control at the earliest.
The CM and Ministers inquired about the measures being taken to establish a strong system so that the officers of all departments work in coordination.
Officials informed the CM that 141 flood prone areas have already been identified. Special measures have been taken to prevent floods. Set up water harvesters to ensure that the flood water goes smoothly from the areas that received huge flood water. Strict measures are being taken to prevent waterlogging on the roads.
Instructed the police officials to take measures to avoid traffic problems through physical policing. Provide traffic alerts to Hyderabad city people through FM radio. Take up the recruitment of Home Guards without shortage of personnel to solve the traffic problems.
మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
సీఎంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త.
వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు:
- అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం.
- ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్ గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ ను ఇంటిగ్రేట్ చేయాలన్న సీఎం.
- ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటిని వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.
- అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం, మంత్రులు.
- ఇప్పటికే 141వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపిన అధికారులు.
- వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించిన అధికారులు.
- నీరు ఎక్కువ వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వరద నీరు వెళ్లేలా వాటర్ హార్వెస్ట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన అధికారులు.
- రోడ్డుపై నీరు నిల్వకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన అధికారులు.
- ఫిజికల్ పోలీసింగ్ విధానం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చరపట్టాలని అధికారులకు సూచించిన సీఎం.
- ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ హైదరాబాద్ ప్రజలకు అందించేలా ఏర్పాటు చేయాలన్న సీఎం.
- ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోమ్ గార్డుల రిక్రూట్ మెంట్ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం.