Submit a comprehensive report on the revival of the closed Nizam Sugar Factories: CM

Cm Sri Revanth Holds Reivew Meeting

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy directed the Cabinet Sub-Committee to submit a comprehensive report on the revival of the closed Nizam Sugar Factories at the earliest. The CM held a meeting with the Sub Committee at the Secretariat today (Sunday).

The Sugar Factory Revival Committee Chairman and State Industries Minister D Sridhar Babu and Ministers – Damodara Raja Narsimha, Komatireddy Venkat Reddy, MLC Jeevan Reddy, MLAs Sudarshan Reddy, Rohit Rao, Adluri Laxman Kumar and former MLA A. Chandrasekhar and officials participated in the meeting.

The committee discussed pending arrears and the financial difficulties faced by the closed Nizam Sugar Factories at Bodhan and Mutyampet. The Chief Minister enquired about the requirements of Sugarcane farmers and their problems comprehensively.

CM Revanth Reddy asked the Sub Committee to make suitable recommendations and suggestions to the revival of the sugar factories.

The CM instructed the committee to prepare a report in a stipulated time. The CM said that he will hold another meeting based on the report submitted by the committee.

రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి కేబినేట్ సబ్ కమిటీకి సూచించారు. ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది.

చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు తో పాటు మంత్రులు శ్రీ దామోదర రాజనర్సింహ, శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ సుదర్శన్ రెడ్డి, శ్రీ రోహిత్ రావు, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఏ. చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు. ఆర్థిక ఇబ్బందులను చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాలను సమగ్రంగా చర్చించారు.

మూతపడ్డ వాటిని తెరిపించేందుకు ఏమేం చేయాలి, ఏయే మార్గాలను అనుసరించాలో అన్వేషించి తగు సలహాలు సూచనలను అందించాలని సీఎం శ్రీ రేవంత్ రెడ్డి కమిటీకి సూచించారు.

నిర్ణీత గడువు పెట్టుకొని కమిటీ నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి సమావేశమవుదామని సీఎం అన్నారు.