- 15,000 police jobs will be filled in 15 days
- Group-1 notification with 60 additional vacancies soon
- Putting efforts to solve all problems in Singareni
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy said that a notification will be issued to fill 15,000 posts in the State Police Department in the next 15 days. Group-1 notification will also be issued by adding 60 more vacancies. The CM said that the government is putting all efforts to fill the vacancies and appealed to 30 lakh unemployed people to prepare for the competitive exams. The Government will take measures to instill confidence among 32 lakh unemployed who lost faith in the system due to the neglect of the previous government in the last 10 years. The government will also support the neglected Singareni organization in the previous government.
The Chief Minister handed over appointment orders to 441 selected candidates in the Singareni Collieries Company Limited (SCCL) at Dr. B. R. Ambedkar statue in Hyderabad. Deputy CM Sri Bhatti Vikramarka, Minister Sri Ponnam Prabhakar and MLAS attended the programme.
On this occasion, the Chief Minister handed over appointment orders to 412 people on compassionate grounds and another 29 people also received appointment orders. They include shift workers, junior assistants and motor mechanics.
The Chief Minister said that the handing over of the appointment orders is the testimony of the spirit of democracy before the statue of Ambedkar. CM Sri Revanth said that the role of Singareni workers in the achievement of Telangana state is commendable. The CM recalled un-relented struggle by the coal workers for Telangana state. The previous state government had made Singareni a sick industry, CM Sri Revanth said that the Centre had also created many hurdles to Singareni organization.
The Chief Minister said that the Singareni region supported the Congress in the Assembly election and helped in the formation of the People’s Government. The CM appreciated the Singareni workers for giving a big mandate to the Congress candidates in the election. The BRS affiliated workers wing has secured only 3 percent of votes in the polls, the Chief Minister said that he already ordered that 80 percent of jobs in Singareni will be given to the locals only. CM Sri Revanth said that the government will discuss the issue of building a super specialty hospital in Singareni area and take a positive decision soon. Age relaxation for compassionate appointments will also be considered.
MLAs Sri K. Sambasiva Rao, Sri P Venkateshwarlu, Sri Makkan Singh Raj Thakur, Sri Prem Sagar Rao, Sri Gaddam Vivek, Sri Gaddam Vinod, Smt. Kova Lakshmi, Chief Secretary Smt. Santhi kumari, Singareni MD Sri Balaram Naik, INTUC General Secretary Sri Janaprasad, Singareni Colliery Workers Union President Sri Vasireddy Seetharamaiah and others participated.
- 15రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ
- త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్ అదనంగా 60 ఖాళీలు
- సింగరేణిలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి
రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. 60 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.
పదేండ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన 32 లక్షల మంది నిరుద్యోగుల్లో విశ్వాసం నింపేందుకు తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందన్నారు. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. సింగరేణిలో 441 మందికి హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క, మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 412 మందికి కారుణ్య నియామక పత్రాలు, 29 మందికి ఉద్యోగ నియామకాల పత్రాలను అందజేశారు. వీరిలో బదిలీ వర్కర్లు, జూనియర్ అసిస్టెంట్లు, మోటారు మెకానిక్లు ఉన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా, అంబేద్కర్ విగ్రహ సాక్షిగా నియామకాల పత్రాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ తగ్గించలేరని ఆయన స్పష్టం చేశారు. పార్టీలు తెలంగాణ సాదనలో వైఫల్యం చెందినా కార్మికులు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని ఖాయిలా పడేలా చేసిందని ఆయన అన్నారు. కేంద్రం కూడా సింగరేణి సంస్థకు అనేక అడ్డంకులు సృష్టించిందన్నారు. గత ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం కాంగ్రెస్ కు అండగా నిలిచి ప్రజాప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిందని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు వేలాది ఓట్ల మెజారిటీ రావడం వెనుక సింగరేణి కార్మికుల కృషి వుందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల అధికారంలో వున్న బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘానికి సింగరేణి ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని సిఎం అన్నారు.
సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఇటివలే తాను ఆదేశించినట్లుగా సీఎం స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. కారుణ్య నియామకాల వయస్సు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ కూనంనేని సాంబశివరావు, శ్రీ పాయం వెంకటేశ్వర్లు, శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, శ్రీ ప్రేమ్ సాగర్ రావు, శ్రీ గడ్డం వివేక్, శ్రీ గడ్డం వినోద్, శ్రీమతి కోవా లక్ష్మీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, సింగరేణి ఎండి శ్రీ బలరాం నాయక్, ఐ.ఎన్.టి.యు.సి జనరల్ సెక్రటరీ శ్రీ జనప్రసాద్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.