CM called on NITI Aayog Vice Chairman in New Delhi

Cm Sri Revanth Reddy Called On Niti Aayog Vice Chairman In New Delhi 05 02 2024 (2)

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy appealed to NITI Aayog Vice Chairman Suman Bery to cooperate in the release of Rs.1800 crore grants to Telangana from the Union Government. The CM called on NITI Aayog Vice Chairman in New Delhi today.

The CM requested to provide required funds for the development of Musi Riverfront in Hyderabad and also pleaded with the Vice Chairman to help for World Bank aid. The Vice Chairman of NITI Aayog is also requested to extend financial support for the supply of drinking water in the state as well as the reforms to be brought by his government in the fields of Medical, Health and Education sectors in the state.

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ శ్రీ సుమ‌న్ భేరీకి ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మ‌న్‌ను ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈరోజు క‌లిశారు.

హైద‌రాబాద్‌లో మూసీ న‌ది రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇప్పించాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్రపంచ‌బ్యాంకు ఎయిడ్ విడుద‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌స‌ర‌మైన నిధులతో పాటు రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం వైద్య‌, ఆరోగ్య‌, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్క‌ర‌ణ‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మ‌న్‌కు ముఖ్య‌మంత్రి విజ్ఙ‌ప్తి చేశారు.