A delegation of MEINHARDT Group met CM

A Delegation Of Meinhardt Group Met Cm Sri Revanth Reddy 06 01 2024 (3)

Reputed companies from all over the world are coming forward to execute the prestigious Musi Riverfront development project which has been conceived by the Telangana Government in Hyderabad. The representatives from the well known company called on Chief Minister Sri A Revanth Reddy at the Secretariat today (Tuesday).

During his recent visit to London and Dubai, the Chief Minister inspected the Riverfront projects and held special meetings with representatives of many foreign companies, design, planning, architecture firms and consultancy experts in Dubai. Further, the officials of Hyderabad Urban Development Authority (HUDA) and Musi River Front Development Corporation are holding talks with various companies. As part of the meetings, the representatives of the Meinhardt (MEINHARDT) company from Singapore called on CM Revanth Reddy.

The company officials made a PowerPoint presentation on the project designs they have undertaken in different countries as well as the models of the projects to be adopted for Musi development in Hyderabad. CM Revanth Reddy suggested the company representatives design the models to suit the future needs of the city. The CM said that the outline of Hyderabad City will change with the expansion of Outer Ring Road (ORR), Regional Ring Road (RRR) and the upcoming railway lines around the city. The CM suggested the companies develop the Musi riverfront development model in accordance with the expansion plans.

A delegation of MEINHARDT Group led by CEO Omar Shahzad and Suresh Chandra met the Chief Minister. State Chief Secretary Santhi Kumari, Municipal Administration and Urban Development Authority Principal Secretary Dana Kishore, HMDA Joint Commissioner and Musi River Front Development Corporation MD Amrapali also participated in this meeting.

హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.

ఇటీవల లండన్, దుబాయ్ పర్యటనలో ముఖ్యమంత్రి అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించారు. దుబాయ్ లో పలు విదేశీ కంపెనీలు, డిజైన్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తదుపరి సంప్రదింపుల్లో భాగంగా హైదరాబాద్ అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ, మూసీ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా సింగపూర్ కు చెందిన మెయిన్హార్డ్ట్(MEINHARDT) కంపెనీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. వివిధ దేశాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టు డిజైన్లతో పాటు హైదరాబాద్ లో మూసీ డెవెలప్ మెంట్ కు అనుసరించాల్సిన ప్రాజెక్టుల నమూనాలపై పవర్ పాయింట్ ప్రజంటెషన్ ఇచ్చారు.

హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నమూనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులకు సూచించారు. అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, సిటీ చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని అన్నారు. వాటికి అనుగుణంగా మూసీ రివర్ ఫ్రంట్ నమూనాలు రూపొందించాలని సూచించారు.

మెయిన్ హార్ట్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షహజాద్, సురేష్ చంద్ర తో పాటు ప్రతినిధి బృందం సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్, మూసీ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రాపాలి ఈ భేటీలో పాల్గొన్నారు.