More dump yards in Hyderabad

Cm Revanth Reddy Held A Meeting With The Representatives Of Confederation Of Indian Industry (cii) 06 01 2024 (3)

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy suggested to the officials to set up four Dump Yards on the four sides of the Hyderabad city, the dump yard will be established far away from the residential areas. Adequate measures will be taken to prevent any health problems arising due to the dump yards.

At present, there is only one dump yard in the entire city of Hyderabad in Jawahar Nagar. About 8,000 tonnes of garbage is being transported to the Jawahar Nagar dump yard every day. The dump yard has been creating trouble for the local dwellers with air pollution and bad smell. The officials brought to the notice of the Chief Minister that they identified new dump yard sites in Shamshabad and Medak in the past in order to reduce pollution. The CM asked the officials to examine the sites and establish them without disturbing local people. The Chief Minister suggested that 15 MW of electricity can be generated from garbage and for this establishment the officials should coordinate with TSSPDCL. The government will extend full support to set up garbage recycling plants.

METRO RAIL
CM Revanth Reddy clarified again on the expansion of Metro Rail services in the meeting of CII representatives. Earlier, it was planned to expand the metro services on a 32 km stretch from Gachibowli to Airport. It was not of much use to the common people. The CM said that many rich people in the surrounding areas of Gachibowli and Jubilee Hills are using their own vehicles. The chances of using the metro services on the proposed Gouliguda – Falak Nama – Airport route and LB Nagar airport route are more. The CM said that this route will help a lot of people who go to the airport to give send off to their family members going to Arab countries.

Musi Riverfront development
The government has already decided to develop the Musi Riverfront in the first phase on a 55 km stretch. The CM said that the government is determined to develop the entire areas of Ring Road to Ring Road. The government proposed to set up international level amusement parks, waterfalls, children water sports, street vendors, business centers, and shopping malls with unique designs in the catchment area of Musi river. The CM also suggested creating a tourism circuit by connecting the historical buildings like Charminar, Golconda, Seven Tombs, Taramati Baradari located on the banks of Musi river. Entrepreneurs are invited to invest in these areas in the PPP model. The prospective investors are suggested to provide a facility to spend people in a pleasant atmosphere from 6 pm to 6 am. The CM asked the officials to build check dams and install water fountains and waterfalls in the Musi catchment area. The government will also support the construction of five star hotels.

హైదరాబాద్‌లో మరిన్ని డంప్ యార్డులు 

హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా నాలుగు డంప్ యార్డులు ఏర్పాటు చేయాలని, అవి ప్రజల నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. డంప్ యార్డుల వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 

ప్రస్తుతం నగరం మొత్తంలో ఒకే ఒక్క డంప్ యార్డ్ జవహర్ నగర్‌లో ఉంది. రోజుకు 8,000 టన్నుల చెత్త జవహర్ నగర్‌లోని డంప్ యార్డుకు తరలిస్తున్నారు. వాయు కాలుష్యం మరియు దుర్వాసనతో ఈ డంప్ యార్డ్ స్థానిక వాసులకు ఇబ్బందులు సృష్టిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించడానికి శంషాబాద్ మరియు మెదక్ ప్రాంతాల్లో కొత్త డంప్ యార్డ్ సైట్లను గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సైట్ల పరిశీలన అనంతరం స్థానిక ప్రజలకు ఇబ్బంది కలుగకుండా డంప్ యార్డులు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను కోరారు. చెత్త నుండి 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని, ఇందుకై టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ తో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. చెత్త రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని చెప్పారు. 

మెట్రో రైల్: 

CII ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి మెట్రో రైలు సేవల విస్తరణ గురించి మరోసారి వివరణ ఇచ్చారు. గతంలో గచ్చిబౌలి నుండి ఎయిర్‌పోర్ట్ వరకు 32 కిలోమీటర్ల మేర మెట్రో సేవల విస్తరణకు ప్రణాళికలు రచించారు. దీనివల్ల సామాన్య ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూరదు. గచ్చిబౌలి మరియు జూబ్లీహిల్స్ పరిసర ప్రాంత ధనిక ప్రజలు సొంత వాహనాలను ఉపయోగిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిపాదిత గౌలిగూడ- ఫలక్‌నుమా- ఎయిర్‌పోర్ట్ మార్గంలో మెట్రో సేవలు ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అరబ్ దేశాలకు వెళ్లే కుటుంబ సభ్యులకు వీడ్కోలు చెప్పే చాలామంది ప్రజలకు ఈ మార్గం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. 

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్:

మొదటి దశలో 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రింగ్ రోడ్డు నుంచి రింగ్ రోడ్డు వరకు అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి అన్నారు. మూసీనది పరివాహక ప్రాంతాల్లో అపూర్వమైన డిజైన్లతో అమ్యూజ్‌మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, పిల్లల వాటర్ స్పోర్ట్స్, వ్యాపార కేంద్రాలు, షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మూసీనది ఒడ్డున ఉన్న చార్మినార్, గోల్కొండ, సెవన్ టూంబ్స్, తారామతి బారాదరి మొదలైన చారిత్రాత్మక కట్టడాలను కలుపుతూ పర్యాటక వలయాన్ని నిర్మించాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. PPP మోడల్‌లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. సాయంత్రం 6గంటల నుండి ఉదయం 6గంటల వరకు ప్రజలు ఒక ఆహ్లాదకర వాతావరణంలో గడిపేలా సౌకర్యాలు అందించాలని ముఖ్యమంత్రి భావి పెట్టుబడిదారులకు సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో చెక్‌డ్యాంలను నిర్మించి వాటర్ ఫౌంటెన్స్, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులతో చెప్పారు. ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.