JSW Neo Energy, a subsidiary of JSW Energy, has announced the setting up of a Pumped Storage Project in Telangana, with an investment of INR 9,000 crore at Telangana Pavilion, here.
A Memorandum of Understanding (MoU) was signed between the State Government of Telangana and JSW Neo Energy at a meeting here at the World Economic Forum.
Mr. Sajjan Jindal, Chairman, of JSW Group, met with the Hon’ble Chief Minister of Telangana, Sri A. Revanth Reddy on the sidelines of WEF and announced the plan for setting up the project.
The proposed Pumped Storage Project will have an energy generation capacity of 1,500 MW.
Headquartered in Mumbai, JSW Energy is an integrated power company that generates, transmits, and trades electricity from thermal, hydro, and solar sources.
As a leading private sector power company in India, it has an operational capacity of 4,559 MW and is the country’s largest Independent Hydro Power Producer (IPP).
JSW Neo Energy, a wholly owned subsidiary of JSW Energy that focuses on renewable and new energy solutions, will be responsible for setting up the proposed project in Telangana.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy assured JSW of all the necessary support for the Pumped Storage Project and said that the proposed project is aligned with the State’s focus on promoting renewable energy.
The Hon’ble Chief Minister further stated that JSW is a key partner for the State in its journey towards clean and green energy and the Government is keen to collaborate with JSW for their future projects in India.
Mr. Sajjan Jindal, Chairman of JSW Group expressed his gratitude for the assurances to JSW and support from the Government of Telangana for their proposed project.
He further stated that JSW is rapidly expanding in India and aims to further grow its presence in the State.
Minister for Industries and ITE&C Sri D. Sridhar Babu, Principal Secretary ITE&C, I&C Jayesh Ranjan, and Special Secretary, Investment Promotion, Vishnu Vardhan Reddy were also present during the meeting.
తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్, రూ 9,000 కోట్ల పెట్టుబడులు
జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ (JSW Energy) అనుబంధ సంస్థ JSW నియో ఎనర్జీ, తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం JSW నియో ఎనర్జీ మధ్య ఈ అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. దావోస్ లో జేఎస్ డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. ఈ కొత్త ప్రాజెక్ట్ 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
JSW ఎనర్జీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉన్నది. ఈ సంస్థ థర్మల్, హైడ్రో మరియు సౌర వనరుల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థగా, ఇది 4,559 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. JSW నియో ఎనర్జీ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి చేస్తుంది.
తెలంగాణలో ఏర్పాటు చేసే పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ కు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తుందని అన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో భాగంగా JSW ఎనర్జీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, భవిష్యత్ ప్రాజెక్టులపై సహకరించడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ప్రభుత్వం అందించిన సహకారానికి సజ్జన్ జిందాల్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో JSW వేగంగా విస్తరిస్తున్నదని, తెలంగాణలోనూ తమ గ్రూప్ ను విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.