Delegation of BFSI Consortium met CM

Delegation Of Bfsi Consortium Met Cm Sri Revanth Reddy 31 01 2024 (2)

The delegation of Banking Financial Services Insurance (BFSI) Consortium, met Hon’ble Chief Minister Sri Revanth Reddy in Dr. B.R. Ambedkar Telangana State Secretariat today.

CM said, that skilling is a critical area of focus for their government and he is confident this domain-focused holistic skilling will make an impact and requested the BFSI to help create 5,000 Engineering and 5,000 Business graduates for the next financial year.

The delegation of the Banking Financial Services Insurance (BFSI) Consortium initiative shall address the gap in Technical and Business & Commerce related education vis a vis the industry requirements by incorporating functional and Domain training, specific Technology trainings and backed by behavioral programs to deliver holistic learning and create ready talent for the Global BFSI Industry in Telangana.

Sri Ramesh Kaza, representing the visiting BFSI leaders said, he is truly excited about the support by the Hon’ble Chief Minister. He said the Consortium is committed to making an impact and will complete the required MoUs to start the training for the selected students.

Ministers Sri Sridhar Babu, Sri Komatireddy Venkat Reddy, Smt. Konda Surekha, Chief Secretary Smt. Santhi Kumari, CM Principal Secretary Sri Sheshadri, Principal Secretary Education Sri Burra Venkatesham Special Secretary Sri Ajit Reddy, the senior leaders of the BFSI, Sri Ramesh Kaza, SVP, State Street, Ms. Mamatha Madireddy, MD, HSBC, Sri Rajesh Balaraju, COO, LSEG, Sri Subba Perepa, MD, Sri JP Morgan Chase, Sri Ravi Tangirala, CEO, Sri MassMutual, and Sri Lax Chepuri, CEO, Technogen and others were present.

బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ (BFSI) కన్సార్టియం ప్రతినిధులు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి అత్యంత కీలకమని, తమ ప్రభుత్వం వీటికి అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్, బిజినెస్ రంగాల్లో సాంకేతిక నిపుణుల తయారీకి కన్సార్టియం కీలక పాత్ర పోషించాలని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అయిదు వేల మంది ఇంజనీరింగ్, అయిదు వేల మంది బిజినెస్ గ్రాడ్యుయేట్ లను తగిన సాంకేతిక శిక్షణను ఇచ్చేందుకు బీఎఫ్సీఐ సహాయ సహకారాలు అందించాలని సీఎం కోరారు.

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తగిన ప్రోగ్రాం​లు, శిక్షణ, సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు బీఎఫ్ఎస్ఐ ప్రత్యేకంగా చొరవ చూపుతోంది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా సాంకేతిక, వ్యాపార వాణిజ్య విద్యలో ఉన్న అంతరాలను పరిష్కరిస్తుంది. అందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు చేపడుతోంది.

బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం ప్రతినిధి శ్రీ రమేష్ కాజా ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ఎంపికైన విద్యార్థులందరినీ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణను అందిస్తామని అన్నారు. త్వరలోనే కన్సార్టియం తరఫున అవసరమైన అవగాహన ఒప్పందాలు చేసుకుంటామని చెప్పారు. మంత్రులు శ్రీ శ్రీధర్‌బాబు, శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీమతి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, సిఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీ శేషాద్రి, ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీ బుర్ర వెంకటేశం, ప్రత్యేక కార్యదర్శి శ్రీ అజిత్‌ రెడ్డి, బిఎఫ్‌ఎస్‌ఐ ప్రతినిధులు శ్రీ రమేష్‌ కాజా, శ్రీమతి మమత మాదిరెడ్డి, శ్రీ రాజేష్‌ బాలరాజు, శ్రీ సుబ్బా పెరెపా, శ్రీ రవి తంగిరాల తదితరులు పాల్గొన్నారు.