CM discussions with top global city planners and designers in Dubai

Cm Discussions With Top Global City Planners And Designers In Dubai

Hon’ble Chief Minister Sri Revanth Reddy led a delegation and held detailed discussions with top global city planners and designers, mega master plan developers and architects on Sunday.

The marathon back-to-back meeting sessions were primarily focused on developing the 56-kilometer-long Musi riverfront, green urban spaces, and exploring commercial linkages, and investment models.

The meetings in Dubai are an extension and continuation of the different meetings with over 70 different major global design, planning and architecture firms, consultancies and experts.

The discussions had the global firms showcase their work in aligned areas and present projects past and currently underway in Europe, Middle East, and major cities globally.

Almost all the firms have expressed interest in partnering with Hyderabad, and Telangana. They would be visiting Telangana in coming days for further consultations.

Welcoming the best-in-class firms to Hyderabad, Chief Minister Sri Revanth Reddy said, “Historically, cities have evolved near water. Rivers and lakes define cities naturally. Once the Musi is rejuvenated, Hyderabad will be a rare city in the world to be defined by a river and several major lakes.”

Asking these firms to evolve early plan prototypes with the highest ambition, CM Sri Revanth Reddy said, “I am not competing with other Indian cities and states. I am trying to benchmark against the best globally, and will try to better it.”

The consultations underway would continue till late Sunday night (a working day in Dubai) before the Chief Minister-led delegation would be leaving for Hyderabad.

Officials who participated include Principal Secretary to CM Sri V. Sheshadri, CM Special Secretary Sri Ajit Reddy, MA&UD Principal Secretary Sri Dana Kishore, HMDA Joint Commissioner and MD MRDCL Smt. Amrapali Kata, and others.

దుబాయ్ లోని టాప్ గ్లోబల్ ప్లానర్స్ మరియు డిజైనర్స్‌తో సీఎం చర్చలు

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం టాప్ గ్లోబల్ సిటీ ప్లానర్స్, డిజైనర్స్, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్స్ మరియు ఆర్కిటెక్ట్స్‌తో ఆదివారం విస్తృతమైన చర్చలు జరిపింది. 

సుదీర్ఘమైన ఈ వరుస సమావేశాలు ప్రాథమికంగా 56 కిలోమీటర్ల పొడవైన మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, హరిత పట్టణ ప్రాంతాలు, కమర్షియల్ లింకేజీల అన్వేషణ మరియు పెట్టుబడి నమూనాలపై దృష్టి సారించింది.

70కి పైగా వివిధ ప్రధాన గ్లోబల్ డిజైన్, ప్లానింగ్ మరియు భవన నిర్మాణ సంస్థలు, కన్సల్టెన్సీలు మరియు  ఎక్స్‌పర్ట్‌లతో జరిపిన సమావేశాలకు పొడిగింపు మరియు కొనసాగింపుగా దుబాయ్‌లో ఈ సమావేశాలు జరిగాయి. 

చర్చల్లో భాగంగా వివిధ గ్లోబల్ సంస్థలు ఎలైన్డ్ ఏరియాలలో గతంలో పూర్తి చేసిన, ప్రస్తుతం యూరప్, మిడిల్ ఈస్ట్, ప్రపంచంలోని వివిధ ప్రధాన నగరాల్లో చేపట్టిన ప్రాజెక్టుల పనుల గురించి వివరించారు. 

దాదాపుగా అన్ని సంస్థలూ హైదరాబాద్ మరియు తెలంగాణతో భాగస్వామ్యానికి ఆసక్తి కనబర్చాయి. తదుపరి సంప్రదింపుల కోసం రానున్న రోజుల్లో తెలంగాణను సందర్శించనున్నాయి. 

ఉత్తమ శ్రేణి సంస్థలను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తూ… “నదీతీర ప్రాంతాల్లో నగరాలు వికాసం చెందాయన్నది చరిత్ర చెప్పిన సత్యం. నదులు మరియు సరస్సులే నగరాలను మనకు పట్టిఇస్తాయి. మూసీ పునరుద్ధరణ ద్వారా నదులు, అనేక ప్రధాన సరస్సులతో కూడిన అరుదైన నగరంగా హైదరాబాద్ ప్రపంచంలో నిల్చిపోతుంది” అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్నారు. 

Telangana Rising