CM discusses ambitious plans for River Musi rejuvenation with Port of London Authorities

Cm Revanth Reddy Discusses Ambitious Plans For River Musi Rejuvenation With Port Of London Authorities

• CM-led delegation undertakes multi-dimensional, varied stakeholder impact studies with authorities of River Thames apex governing body
• Comprehensive support and partnership assured for River Musi project by London authorities:

Hon’ble Chief Minister of Telangana, Sri A. Revanth Reddy garu kickstarted the London part of his tour by holding three-hour long discussions with officials and experts of the principal water body governing body of river Thames – the Port of London Authority on Thursday.

Chief Minister Revanth Reddy spoke of his vision for rejuvenating river Musi, and of the principal reason for visiting London – to learn about the management of river Thames, understanding and gathering insights from its management and collating best practices.

Ms. Sian Foster, Director of Corporate Affairs, and Ms. Raj Kehal-Livi, Head of stakeholder Engagement, Port of London Authority, presented a comprehensive history of the developmental activities along the River Thames, natural challenges and engineering response and solutions, stakeholder management, investments and revenue management, and best practices evolved over decades.

“Most cities on earth have developed historically besides rivers, lakes or the ocean. Water bodies are life-sustaining forces powering and enabling urban human habitats. Hyderabad developed along river Musi but is unique in being centered around Hussainsagar lake, and is fostered by other major water bodies, like Osmansagar. Once we reinvigorate and bring back Musi to its fullest force, Hyderabad will be powered by both a river and lakes,” explained Chief Minister.

Finding alignments with the Hon’ble CM’s vision with the Vision 2050 of London authorities, Ms. Kehal-Livi and Ms. Foster said, “We are ensuring the highest levels of sustainability for the river, even as we develop and optimise the developments along the banks. Finding optimal revenue models to ensure maximum benefits for people and local communities, and best-in-class project management for various projects underway and to be taken up in the future is our continual focus.”

The apex body authorises assured all support to Hyderabad in all its efforts to rejuvenate river Musi. A more detailed outline of various potential partnership points was discussed. Both sides agreed to have more discussions and engagements in the future and to collaborate on a posse of specific projects.

Principal Secretary to CM V. Sheshadri, Principal Secretary to MA&UD Dana Kishore, CM special secretary B. Ajit Reddy, HMDA Joint Commissioner & MD MRDCL Amrapali, Special Secretary Investments & Promotions E. Vishnu Vardhan Reddy, SE MRDCL Venkatramana participated in this programme.

  • మూసీ పునరుజ్జీవానికి థేమ్స్ ప్లాన్
  • లండన్ టూర్ లో సీఎం రేవంత్ రెడ్డి
  • థేమ్స్ రివర్ పాలక మండలితో చర్చలు
  • రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సహకారం

మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తెలుసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటించారు. లండన్ లోని థేమ్స్ నదిని సందర్శించారు. థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం అక్కడి థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు.

దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, ఫోర్డ్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ కెహల్ లివీ సీఎంకు వివరించారు. అందులో భాగంగా ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, భాగస్వామ్యమైన సంస్థలు, అందంగా తీర్చిదిద్దేందుకు అనుసరించిన అత్యుత్తమ విధానాలన్నీ ఈ సందర్భంగా చర్చించారు.

‘నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయి. హైదరాబాద్ సిటీకి అటువంటి ప్రత్యేకత ఉంది. అటు మూసీ నది వెంబడి, ఇటు హుస్సేన్ సాగర్ చుట్టూ, ఉస్మాన్ సాగర్ లాంటి నదీ వ్యవస్థ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా తిరిగి మూసీకి పునర్వైభవం తీసుకు వస్తే నదులు, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుంది…‘ అని ముఖ్యమంత్రి వివరించారు.

తన విజన్ 2050కు అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి లండన్ అధికారులు సానుకూలతతో చర్చలు జరిపారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిచ్చినట్లు అక్కడి అధికారులు వివరించారు. నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం, ఎంచుకున్న ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే రెవిన్యూ మోడల్ ను ఎంచుకోవాలని చెప్పారు. ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే కొత్త విధానాలు ఎప్పటికప్పుడు గమనించటంతో పాటు, ప్రాజెక్టు నిర్వహణపై నిరంతరం దృష్టి పెట్టాలన్నారు.

హైదరాబాద్ లో మూసీ నదిని పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చింది. ఇదే సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ లైన్, వివిధ సంస్థల భాగస్వామ్యంపైనా చర్చించారు. ఈ ప్రాజెక్టుకు నిర్దిష్టమైన సహకారం అందించేందుకు భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపాలని ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది.

సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ శేషాద్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ దాన కిషోర్, సీఎం స్పెషల్ సెక్రెటరీ శ్రీ బి.అజిత్ రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ శ్రీమతి అమ్రాపాలీ, ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ ప్రమోషన్స్ స్పెషల్ సెక్రెటరీ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, మూసీ రివర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎస్ఈ శ్రీ వెంకట రమణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Telangana Rising