CM extends Rs 2 lakh financial assistance to the bereaved family of swiggy boy

Cm Extends Rs 2 Lakh Financial Assistance To The Bereaved Family Of Swiggy Boy 30 12 2023

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy extended Rs 2 lakh financial assistance to the bereaved family of Swiggy delivery boy who died accidentally while performing his duties. As promised earlier, the Chief Minister provided financial help to the family in just a few days. The Chief Minister presented a cheque of Rs 2 lakh from the Chief Minister’s Relief Fund to the victim’s family at the secretariat on Saturday. CM Revanth Reddy held a meeting with Gig workers at Napmpally Exhibition grounds on December 23. The CM mentioned the issue of Swiggy boy who died accidentally four months ago while delivering food to a customer. The Chief Minister said in the meeting he expected the previous government would provide some relief to the victim family but there was no response from the previous government. After coming to know the struggle of the victim family, the CM ordered the officials to provide Rs.2 lakhs assistance from the Chief Minister’s Relief Fund to the family. The officials collected the details of the family in just one week. The victim family met the Chief Minister and received the assistance of Rs 2 lakh from Chief Minister at the Secretariat. The family expressed gratitude for showing generosity towards them and for CM’s timely help.

స్విగ్గీ బాయ్‌ను కోల్పోయినవారి కుటుంబానికి సీఎం 2 లక్షల ఆర్ధిక సాయం 

విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి రూ. 2 లక్షల ఆర్ధిక సాయం అందించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు కొద్దిరోజుల్లోనే ముఖ్యమంత్రి ఆ కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారు. శనివారం సచివాలయంలో బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ. 2 లక్షల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. డిసెంబర్ 23న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి గిగ్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కష్టమర్‌కు ఫుడ్ డెలివరీ చేస్తూ నాలుగు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్‌ విషయాన్ని సీఎం ప్రస్తావించారు. బాధిత కుటుంబానికి గత ప్రభుత్వం కొంత ఊరటనిస్తుందని తాను ఆశించినప్పటికీ, గత ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదని ముఖ్యమంత్రి సమావేశంలో అన్నారు. బాధిత కుటుంబం పడుతున్న కష్టాన్ని తెలుసుకున్న సీఎం ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 2 లక్షల సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఒక వారం రోజుల్లోనే కుటుంబ వివరాలు సేకరించారు. బాధిత కుటుంబం ముఖ్యమంత్రిని కలిసి, సచివాలయంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ. 2 లక్షల సహాయాన్ని అందుకుంది. తమ పట్ల ఉదారత చూపినందుకూ, సకాలంలో సాయం చేసినందుకూ కుటుంబం సీఎంకు కృతజ్ఞతలు తెలిపింది.