CM angry over sale of Praja Palana applications

Cm Revanth Reddy Held A Review Meeting With Officials

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy expressed anger over the sale of applications which are being submitted to avail the benefits of government schemes during Praja Palana programme. The officials have been asked to make available as many applications as required to the applicants. The chief minister clarified that all the old beneficiaries of Rythu Bandhu and Pension schemes need not to worry and the new beneficiaries will have to apply to avail the benefits. People should not get confused in this matter.

Chief Minister A Revanth Reddy held a review on the submission of applications in Praja Palana and the ground reality with Chief Secretary Santhi Kumari and other top officials.

In the wake of the commencement of the Praja Palana which has been launched on December 28 in the state, the chief minister enquired the officials about the details of the Gram Sabhas held so far, details of applications and the process of accepting the applications in Praja Palana. The Chief Minister asked the officials to make available as many applications as required. The CM instructed the officials not to create difficulty to the applicants in submitting applications. District Collectors have been asked to take stringent action against those who sell applications. CM Revanth Reddy suggested that public representatives should participate in Praja Palana programme. The authorities have been asked to ensure citizens will face any kind of difficulty in submitting applications. The officials have also been asked to provide drinking water supply and erect tents for people who attend the Praja Palana to submit applications.

ప్రజాపాలన దరఖాస్తుల విక్రయంపై సీఎం ఆగ్రహం 

ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ పథకాల లబ్ది పొందేందుకు సమర్పించే దరఖాస్తుల విక్రయంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. రైతు బంధు, పెన్షన్ పథకాల పాత లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొత్త లబ్ధిదారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు అయోమయానికి గురి కావద్దని అన్నారు. 

ప్రజాపాలనలో దరఖాస్తుల సమర్పణ, వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 

రాష్ట్రంలో డిసెంబర్ 28 న ప్రారంభించిన ప్రజాపాలన మొదలుకానున్న నేపథ్యంలో ఇప్పటివరకూ నిర్వహించిన గ్రామ సభల వివరాలు, ప్రజాపాలనలో దరఖాస్తుల వివరాలు, దరఖాస్తుల ఆమోద ప్రక్రియపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. దరఖాస్తుల సమర్పణలో దరఖాస్తుదారులు ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను కోరారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులందరూ పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దరఖాస్తుల సమర్పణలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులూ పడకుండా చూడాలని అధికారులను కోరారు. దరఖాస్తు చేసుకునేందుకు ప్రజాపాలనకు హాజరయ్యే ప్రజలకు తాగు నీటి వసతి కల్పించాలని, టెంట్లు ఏర్పాటు చెయ్యాలని అధికారులను కోరారు.